దేశవ్యాప్తంగా అంతర్గత భద్రతా వ్యవహారాలు, శాంతిభద్రతల పరిరక్షణ అంశాలపై చర్చించేందుకు ప్రతిష్టాత్మక డీజీపీలు, ఐజీపీల కాన్ఫరెన్స్‌ను తిరుపతిలో నిర్వహించనున్నారు. ప్రధానమంత్రితో పాటు కేంద్ర హోం మంత్రి హాజరవుతున్నందున భారీ ఏర్పాట్లు చేయాలని సీఎస్ సాయిప్రసాద్ ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో హోంశాఖ ముఖ్య కార్యదర్శి కుమార్ విశ్వజిత్, జీఏడీ ముఖ్య కార్యదర్శి జె. శ్యామల రావు, అదనపు డీజీపీ మధుసూదన్ రెడ్డి, తిరుపతి కలెక్టర్ వెంకటేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.