సోషల్ మీడియా దిగ్గజం మెటాకు అమెరికా కోర్టులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్ ప్లాట్‌ఫామ్‌ల వల్ల యువత మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతోందని నిర్ధారిస్తూ న్యూ మెక్సికో కోర్టు తీర్పు వెలువరించింది.

కంపెనీకి 567 మిలియన్ డాలర్ల (సుమారు రూ.5,400 కోట్లు) జరిమానా విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది.

మైనర్ల భద్రతకు సంబంధించి కొత్త ఆంక్షలు విధించాలని కోర్టు ఆదేశించింది.