మన్మోహన్ సింగ్ జయంతి సందర్భంగా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఏర్పాటు చేసిన స్మారక పార్కు, విగ్రహాన్ని మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్‌లతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో సీఎం మాట్లాడుతూ.. దేశాన్ని ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబెట్టేందుకు అవసరమైన ఆర్థిక సరళీకృత విధానాలు, సంస్కరణలను మన్మోహన్ అమలు చేశారని గుర్తుచేశారు. పీవీ నరసింహారావు మార్గదర్శకత్వంలో, సోనియా గాంధీ సహకారంతో విద్యా హక్కు, సమాచార హక్కు (RTI), ఉపాధి హామీ చట్టం (MGNREGA), అటవీ హక్కుల చట్టం వంటి విప్లవాత్మక మార్పులను దేశానికి అందించారని కొనియాడారు. అలాంటి గొప్ప మేధావి లెగసీని కాపాడేందుకు ఢిల్లీలో జాతీయ విజ్ఞాన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న మాజీ సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ, దేశ వ్యవస్థలను పటిష్టం చేసి అంతర్జాతీయ స్థాయిలో భారత సార్వభౌమత్వాన్ని నిలబెట్టిన మహనీయుడు మన్మోహన్ సింగ్ అని ప్రశంసించారు.
For more information on this article, read page number 1 & 2 of అభ్యుదయం (Abhyudayam) e-paper dated 27-09-2026






