'కొత్త బంగారు లోకం' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న వరుణ్ సందేశ్, శ్వేతా బసు ప్రసాద్ జంట చాలా కాలం తర్వాత మరోసారి తెరపై కలిసి కనిపించనున్నారు. ఆహా ఓటీటీ ఒరిజినల్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన 'నా వైఫ్ మిస్సింగ్' సిరీస్ టీజర్‌ను గురువారం మేకర్స్ విడుదల చేశారు. పెద్దలు కుదిర్చిన పెళ్లితో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన దంపతుల జీవితంలో అనుకోని మలుపులు చోటుచేసుకోవడం ఈ సిరీస్ ప్రధాన కథాంశం. పెళ్లిచూపుల సమయంలోనే తాను వర్జిన్ కాదని చెప్పిన భార్య, పెళ్లయిన కొద్దిరోజులకే అదృశ్యం కావడం, ఆమె ఆచూకీ కోసం భర్త పోలీసులను ఆశ్రయించడం వంటి అంశాలతో టీజర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగింది. పెళ్లి సమయంలో ఆమె చెప్పిన నిజాలు ఏమిటి? మిస్సింగ్ వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటనే అంశాలను డైరెక్టర్ స్వాతిప్రకాష్ మంత్రిప్రగడ గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
For more information on this article, please refer to Page Number 8, అభ్యుదయం (Abhyudayam) E-paper dated 08-10-2026.






