హైదరాబాద్:
రాకింగ్ స్టార్ యశ్ కథానాయకుడిగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న చిత్రం ‘టాక్సిక్’. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ.. కియారా ఈ సినిమాలో తన పాత్ర కోసం ఎంతో శ్రమించారని, చిత్రీకరణ సమయంలో ఆమె అంకితభావం ప్రశంసనీయమని పేర్కొన్నారు.
​మొదట్లో ఈ పాత్రను ఎంచుకోవడానికి కాస్త సందేహించినా, పాత్రలోని డెప్త్ మరియు భావోద్వేగ తీవ్రతను అర్థం చేసుకుని పూర్తి న్యాయం చేశారని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ పాత్ర కియారా కెరీర్‌లోనే ప్రత్యేకంగా నిలవడమే కాకుండా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని చిత్రబృందం ధీమా వ్యక్తం చేసింది.