గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని రెవెన్యూ, గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. అభివృద్ధి పేరుతో తెచ్చిన నిధులను దుర్వినియోగం చేస్తూ ఖజానాను ఖాళీ చేశారని ఆరోపించారు.
​లక్షల కోట్ల రూపాయల అప్పులు చేసి రాష్ట్రాన్ని సంక్షోభంలో పడేసిన కేసీఆర్, ఇప్పుడు ప్రభుత్వంపై విమర్శలు చేయడం హాస్యాస్పదంగా ఉందని మండిపడ్డారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే రాష్ట్రాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి కృషి చేస్తోందని పేర్కొన్నారు.