తెలంగాణ పర్యాటక రంగ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్న వ్యక్తులు, సంస్థలను గుర్తించి అవార్డులు అందించేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టింది.
ట్రావెల్ ఏజెంట్లు, టూర్ ఆపరేటర్లు, హోటళ్లు, రిసార్టులు, రెస్టారెంట్లు, టూరిజం గైడ్లు, గ్రామీణ పర్యాటక ప్రాజెక్టులు, వైద్య పర్యాటకం, వినోద పార్కులు, వినూత్న పర్యాటక ప్రాజెక్టులు, సోషల్ మీడియా, యువ పర్యాటక క్లబ్‌లు తదితర విభాగాల్లో అవార్డులను ఎంపిక చేయనున్నారు.
హోటళ్లు, రిసార్టుల ఎంపికలో పనితీరు, పరిశుభ్రత, సేవలు, సౌకర్యాలు, పర్యాటకుల సంఖ్య, పర్యావరణహిత విధానాలు, వ్యర్థాల నిర్వహణ, భద్రతా ప్రమాణాలు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోనున్నారు.






