ఐక్యరాజ్యసమితిలో మత స్వేచ్ఛ, మానవ హక్కులపై జరిగిన ఇంటరాక్టివ్ సంభాషణలో భావికా మంగళానందన్ ప్రసంగించారు. చనిపోయినవారికి అంత్యక్రియలు నిర్వహించుకునే ప్రాథమిక హక్కును కూడా కల్పించలేని దేశం ప్రపంచంలోనే అతిపెద్ద లౌకిక ప్రజాస్వామ్యమైన భారత్‌ను వేలెత్తి చూపడం హాస్యాస్పదమని తిప్పికొట్టారు. అంతర్జాతీయ వేదికలపై భారత్‌పై బురదజల్లడం మానుకుని, తమ దేశంలో అంతరించిపోతున్న మైనారిటీలను కాపాడుకోవడంపై దృష్టి పెట్టాలని హెచ్చరించారు.

అభ్యుదయం దినపత్రిక (పేజీ 3)