గల్ఫ్ రీజియన్‌లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం విమాన రాకపోకలపై పడింది. పరిస్థితి మెరుగుపడకపోవడంతో భారత్ నుంచి సౌదీ అరేబియాకు నడిచే సర్వీసులను ఈనెల 24 వరకు రద్దు చేస్తున్నట్లు విమానయాన సంస్థలు శనివారం అధికారికంగా ప్రకటించాయి. ఇండిగో ఎయిర్‌లైన్స్ ఢిల్లీ, హైదరాబాద్, ముంబైల నుంచి రియాద్, జెద్దా, దమ్మం, మదీనాలకు సర్వీసులను రద్దు చేస్తూ సంబంధిత ప్రయాణికులకు సమాచారం అందించింది. ఆకాశ ఎయిర్ సైతం రియాద్ సర్వీసులను 24 వరకు, జెద్దా సర్వీసులను 21 వరకు నిలిపివేసింది. ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సంస్థలు కేరళ, బెంగళూరు, ఢిల్లీల నుంచి రాకపోకలు సాగించే విమానాలను ఈనెల 20 వరకు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించాయి.

మరింత సమాచారం కోసం అభ్యుదయం ఈ-పేపర్ తేదీ: 18-10-2026, పేజీ నంబర్: 1 & 2 చదవండి.