హైదరాబాద్‌లో ఏఐ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌, ఎంటర్‌ప్రైజ్‌ టెక్నాలజీలకు అవసరమైన అధిక సామర్థ్య మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేసే లక్ష్యంతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నారు. డేటా సెంటర్‌ నిర్మాణంలో గ్రీన్‌ ఎనర్జీ వినియోగం, నీటి వినియోగాన్ని సమతుల్యం చేసే విధానాలను అనుసరించనున్నట్లు సంస్థ తెలిపింది.

ప్రపంచవ్యాప్తంగా ఏఐ వినియోగం పెరుగుతున్న నేపథ్యంలో అధిక సామర్థ్యం కలిగిన కంప్యూటింగ్‌ సదుపాయాలకు డిమాండ్‌ పెరుగుతోందని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. హైదరాబాద్‌కు ఈ స్థాయి మౌలిక సదుపాయం రావడం రాష్ట్రానికి అదనపు ప్రయోజనమని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నట్లు కథనంలో ఉంది.

ఈ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్‌ను గ్లోబల్‌ ఏఐ, డేటా సెంటర్‌ హబ్‌గా అభివృద్ధి చేయాలన్న లక్ష్యానికి ఊతం లభిస్తుందని కథనం పేర్కొంది.