యెమెన్‌లోని షల్వా ప్రావిన్స్‌లో ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ రెబెల్స్ సోమవారం ప్రభుత్వ భద్రతా బలగాల శిక్షణ శిబిరంపై విరుచుకుపడ్డారు. సైనికులు శిక్షణలో ఉన్న సమయంలో ఒకేసారి మూడు బాలిస్టిక్ క్షిపణులతో దాడికి పాల్పడటంతో ఘటనా స్థలంలోనే 53 మంది మృతి చెందగా, సుమారు 200 మంది గాయపడినట్లు స్థానిక అధికారులు ధ్రువీకరించారు. ఈ దాడికి తామే బాధ్యులమని హౌతీ మిలిటరీ ప్రతినిధి యహ్యా సరీ ‘ఎక్స్’ వేదికగా ప్రకటించారు. హౌతీల ఆధీనంలోని ప్రాంతాలను స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్న వేళ ఈ దాడితో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చాయి.
మరింత సమాచారం కోసం అభ్యుదయం ఈ-పేపర్ తేదీ: 20-10-2026, పేజీ నంబర్: 1 & 2 చదవండి.






