న్యూయార్క్/వాషింగ్టన్: భారత్, అమెరికా దేశాల మధ్య సరికొత్త వాణిజ్య ఒప్పందం (ట్రేడ్ డీల్) కుదుర్చుకోవడానికి రంగం సిద్ధమైందని డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. వైట్‌హౌస్‌లోని ఓవల్ ఆఫీసులో విలేకరులతో మాట్లాడిన ఆయన.. భారత్‌తో వాణిజ్య చర్చలు తుది దశకు చేరుకున్నాయని, గతంలో కుదిరిన ఒప్పందాల కంటే ఇది ఎంతో మెరుగైనదని తెలిపారు. "భారత్‌కు మాతో వాణిజ్య డీల్ చేసుకోవాలని ఉంది, మేము కూడా సిద్ధంగా ఉన్నాం. ఆ ప్రక్రియ చాలా దగ్గరికొచ్చింది" అని వ్యాఖ్యానించారు.
ప్రస్తుతం అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో భారత్‌లో పర్యటిస్తున్న తరుణంలో ట్రంప్ ఈ ప్రకటన చేయడం అంతర్జాతీయ వర్గాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది. వాణిజ్యం, స్వచ్ఛ ఇంధనం, కీలక రక్షణ పరికరాల తయారీ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ రంగాలలో పరస్పర భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడమే లక్ష్యంగా చర్చలు జరుగుతున్నాయి. గతంలో పన్నుల విధింపు విషయంలో ఇరుదేశాల మధ్య విభేదాలు వచ్చినప్పటికీ, తాజాగా జేమిసన్ గ్రీర్ వంటి అధికారుల సమక్షంలో జరిగిన చర్చల ఫలితంగా కొత్త ముసాయిదా రూపుదిద్దుకుంది.






