వ్యవసాయ భూముల రికార్డుల్లో ఉన్న లోపాలను సవరించడం, భూముల హద్దులను ఖరారు చేయడం కోసం పకడ్బందీ సర్వే నిర్వహించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. పంటల వివరాల నుంచి భూ యాజమాన్య సమాచారం వరకు అన్ని అంశాలను సమగ్రంగా నమోదు చేయాలని నిర్ణయించారు.
డిజిటల్ విధానంలో భూ వివరాలను నమోదు చేయడం ద్వారా భవిష్యత్తులో వివాదాలు తగ్గుతాయని అధికారులు భావిస్తున్నారు. రైతులు తమ భూ వివరాలు, హద్దులు, రికార్డులను పరిశీలించుకుని అవసరమైతే సవరణలకు దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నారు. సర్వే పూర్తయిన తర్వాత స్పష్టమైన భూ రికార్డులు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.






