హైదరాబాద్: కేసీఆర్ కుటుంబానికి చెందిన భూములు, ఆస్తుల వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారింది. కేసీఆర్ కుటుంబానికి వేల కోట్ల రూపాయల విలువైన ఆస్తులు ఎలా సమకూరాయనే అంశంపై ప్రభుత్వం ప్రశ్నలు సంధించింది. 2009 ఎన్నికల అఫిడవిట్‌లో కేసీఆర్ తనకు ఉన్న భూమి వివరాలను ఒక ఎకరంగా పేర్కొన్నారని, ప్రస్తుతం వందల ఎకరాల భూమి ఎలా వచ్చిందో వెల్లడించాలని మంత్రులు ప్రశ్నించారు.
కేసీఆర్ కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న భూముల వివరాలు, సర్వే నంబర్లు, వాటి విలువలను ప్రభుత్వం ప్రస్తావించింది. గతంలో పేర్కొన్న అఫిడవిట్ వివరాలకు, ప్రస్తుతం ఉన్న ఆస్తులకు మధ్య వ్యత్యాసం ఉందని ఆరోపించింది. దీనిపై కేసీఆర్ కుటుంబం ప్రజలకు స్పష్టత ఇవ్వాలని కోరింది.
సున్నా ఎకరాల నుంచి వేల కోట్ల ఆస్తులా? కేసీఆర్ కుటుంబంపై భూవివాదం
కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన భూములు, ఆస్తుల వివరాలపై అధికార, ప్రతిపక్ష నేతల మధ్య ఆరోపణలు–ప్రత్యారోపణలు కొనసాగుతున్నాయి. 2009 ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న ఆస్తులతో ప్రస్తుత ఆస్తులను పోల్చాలని మంత్రులు డిమాండ్ చేశారు.
అక్షర పరిమాణం
- కేసీఆర్ కుటుంబ భూములు, ఆస్తుల వివరాలపై ప్రభుత్వం ప్రశ్నలు లేవనెత్తింది.
- 2009 ఎన్నికల అఫిడవిట్‌లో పేర్కొన్న వివరాలతో ప్రస్తుత ఆస్తులను పోల్చాలని డిమాండ్.






