అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలి. ప్రత్యేక ప్రచార దినాలను సద్వినియోగం చేసుకోవాలని ఎన్నికల అధికారులు సూచన
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు కావాలని ఎన్నికల నమోదు అధికారి, ఆర్డీవో కృష్ణవేణి కోరారు.
అక్షర పరిమాణం
🕒 6, సెప్టెం 2026👁 7 వీక్షణలు
సెప్టెంబర్ 6, 12, 13 తేదీల్లో ప్రత్యేక ప్రచార దినాలు.
2026 అక్టోబర్ 1 నాటికి 18 ఏళ్లు నిండే యువతకు కొత్త ఓటరు నమోదుకు అవకాశం.
ఓటర్ల జాబితా సవరణపై అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన.
ప్రత్యేక ప్రచార దినాల్లో పోలింగ్ కేంద్రాలను సందర్శించి ఓటర్ల ముసాయిదా జాబితాలను పరిశీలించాలని అధికారులు సూచించారు. పేర్ల నమోదు, తొలగింపు, వివరాల సవరణలకు నిర్ణీత నమూనాల్లో దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపారు.
కొత్త ఓటరు నమోదుకు నమూనా–6, జాబితా నుంచి పేరు తొలగింపుకు నమూనా–7, వివరాల సవరణకు నమూనా–8 ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు.
2026 అక్టోబర్ 1 నాటికి 18 సంవత్సరాలు నిండే యువతీ యువకులు కూడా ఓటరుగా నమోదు కావాలని అధికారులు కోరారు.