ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఎల్ నినో ప్రభావం వల్ల రానున్న రోజుల్లో వర్షాభావ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉన్నందున, రైతులు భూగర్భ జలాల లభ్యతను బట్టి ఆరుతడి పంటల వైపు మొగ్గు చూపాలని కార్మిక, గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి కోరారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో స్థానిక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి, కలెక్టర్ హేమావతితో కలిసి ఆయన పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. పేదలకు శాశ్వత గృహవసతి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని, సిద్దిపేట జిల్లాకు ఇప్పటికే 12 వేల ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయని, త్వరలోనే కొత్త ఆసరా పింఛన్లు కూడా అందిస్తామని స్పష్టం చేశారు.
ఎల్ నినో ఎఫెక్ట్: సాగునీటి కొరత దృష్ట్యా రైతులు వరి సాగుకు దూరంగా ఉండాలి!
ఎల్ నినో ప్రభావంతో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు ప్రజలు, రైతులు ప్రభుత్వానికి సహకరించాలని ఉమ్మడి మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి విజ్ఞప్తి చేశారు.
అక్షర పరిమాణం
- దుబ్బాక నియోజకవర్గంలో 2,111 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పట్టాలు, 179 మందికి కల్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేశారు. రిజర్వాయర్లలో ఉన్న నీటిని తాగునీటి అవసరాలకే ప్రాధాన్యతనిచ్చి కాపాడుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి సూచించారు.






