విజయవాడలో జరిగిన విలేకరుల సమావేశంలో వైస్ ఛాన్సలర్ డాక్టర్ పి. చంద్రశేఖర్ ఈ వివరాలను వెల్లడించారు. 1986 నవంబర్ 1న ప్రారంభమైన ఈ వర్సిటీ దేశ వైద్య రంగానికి లక్షలాది మంది నిపుణులను అందించిన ఘనతను సొంతం చేసుకుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి అనుబంధ కళాశాలల నుంచి వెయ్యి మందికి పైగా వైద్య విద్యార్థులు, బోధనా సిబ్బంది పాల్గొంటారని వర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ సాయి సుధీర్ పేర్కొన్నారు.
అక్టోబర్ 26న డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ రూబీ జూబ్లీ వేడుకలు
దేశంలోనే మొట్టమొదటి వైద్య విశ్వవిద్యాలయమైన డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం 40 ఏళ్ల మైలురాయిని చేరుకున్న సందర్భంగా అక్టోబర్ 26న రూబీ జూబ్లీ వేడుకలు జరగనున్నాయి. విజయవాడలోని బీఆర్ అంబేడ్కర్ కళావేదికలో ఈ సదస్సును అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు.
అక్షర పరిమాణం
- ఈ ఉత్సవాలకు భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. విశ్వవిద్యాలయ 40 ఏళ్ల ఘన చరిత్ర, సాధించిన విజయాలను ప్రతిబింబించేలా ప్రత్యేక సావనీర్‌ను ఆవిష్కరించనున్నారు. Main Story:



