ఏ సమస్యలపై ఫిర్యాదు చేయొచ్చు?
ఇండియా పోస్ట్ కస్టమర్ సర్వీసులకు సంబంధించిన ప్రజల ఫిర్యాదులు, సమస్యలను డాక్ అదాలత్‌లో పరిష్కారం కోసం సమర్పించవచ్చు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఫిర్యాదులను నిర్ణీత గడువులోపు అధికారులు కోరారు.
పోస్టు ద్వారా ఫిర్యాదు ఇలా..
ఫిర్యాదుదారులు తమ సమస్యను స్పష్టంగా, అర్థమయ్యే రీతిలో రాసి శ్రీమతి ఎస్. విజయ జ్యోతి, అసిస్టెంట్ డైరెక్టర్ (CS), చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ కార్యాలయం, తెలంగాణ సర్కిల్, హైదరాబాద్-500001 చిరునామాకు పంపాలి.
ఫిర్యాదు పంపే కవర్‌పై తప్పనిసరిగా “డాక్ అదాలత్” అని రాయాలి. ఫిర్యాదుతో పాటు సంప్రదించేందుకు మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ లేదా పూర్తి చిరునామాను తప్పనిసరిగా పేర్కొనాలి.
ఈమెయిల్ ద్వారా కూడా అవకాశం
ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేయాలనుకునే వారు pgco.tl@indiapost.gov.in ఈమెయిల్‌కు తమ ఫిర్యాదును పంపవచ్చు. ఈమెయిల్ బాడీలో లేదా సబ్జెక్ట్‌లో మొదటి లైన్‌లో “డాక్ అదాలత్ ఫిర్యాదు” అని స్పష్టంగా పేర్కొనాలి.
ఈమెయిల్ అక్టోబర్ 14, 2026 సాయంత్రం 5.45 గంటల్లోపు సంబంధిత కార్యాలయానికి చేరేలా పంపాలి.
పోస్టు లేదా ఈమెయిల్.. ఏదో ఒకటి మాత్రమే
ఒకే ఫిర్యాదును పోస్టు, ఈమెయిల్ రెండింటి ద్వారా పంపకుండా.. ఏదో ఒక విధానాన్ని మాత్రమే ఎంచుకోవాలని అధికారులు సూచించారు.
డాక్ అదాలత్‌లో వర్చువల్‌గా పాల్గొనేందుకు అవసరమైన లింక్‌ను సంబంధిత ఫిర్యాదుదారుల మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ఐడీకి తగిన సమయంలో పంపించనున్నారు.
ఈ సమస్యలు స్వీకరించరు
సిబ్బందికి సంబంధించిన విషయాలు, ఉద్యోగ/సేవా సంబంధిత అంశాలు, గౌరవనీయ న్యాయస్థానాల్లో ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల కేసులకు సంబంధించిన సమస్యలను డాక్ అదాలత్‌లో స్వీకరించబోమని తెలంగాణ సర్కిల్ అధికారులు స్పష్టం చేశారు.
డాక్ అదాలత్ తేదీ: 23 అక్టోబర్ 2026
సమయం: మధ్యాహ్నం 12.00 గంటలు
విధానం: వర్చువల్ (ఆన్‌లైన్)
కార్యాలయం: ముఖ్య తపాలా జనరల్ కార్యాలయం, తెలంగాణ సర్కిల్, హైదరాబాద్-500001






