హైదరాబాద్, అభ్యుదయం ధరణి అక్రమాలపై ఉక్కుపాదం మోపుతున్నట్టు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ధరణి నుంచి భూభారతి వరకు లావాదేవీలపై విచారణ జరుపుతున్నట్టు తెలిపారు.
పేదల భూములను కాజేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. నిషేధిత జాబితాలో కొత్తగా అంగుళం భూమి కూడా చేరలేదని అన్నారు.
భూముల ధరల సవరణతో రిజిస్ట్రేషన్ ఆదాయం 20 శాతం వరకు పెరిగిందని పొంగులేటి తెలిపారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.






