బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొణె, రణ్వీర్ సింగ్ తమ అభిమానులకు దసరా పండుగ వేళ అద్భుతమైన సర్ప్రైజ్ ఇచ్చారు. తమ రెండో చిన్నారి ఫోటోను సోషల్ మీడియా వేదికగా అధికారికంగా పంచుకున్నారు. అంతేకాకుండా తమ గారాల పట్టికి ‘దేవి పదుకొణె సింగ్’ (Devi Padukone Singh) అని పేరు పెట్టినట్లు ప్రకటించారు. ఇప్పటికే ఈ దంపతులకు 'దువా' అనే పెద్ద కుమార్తె ఉన్న విషయం తెలిసిందే. దసరా రోజే తమ ఇంటి మహాలక్ష్మి పేరును ప్రకటించడంతో సినీ ప్రముఖులు, అభిమానులు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇక వీరి వృత్తిపరమైన కెరీర్ విషయానికి వస్తే.. దీపికా పదుకొణె ప్రస్తుతం షారుఖ్ ఖాన్‌తో కలిసి ‘కింగ్’ సినిమాతో పాటు అల్లు అర్జున్ సరసన ‘రాకా’ చిత్రంలో నటిస్తున్నారు. మరోవైపు రణ్వీర్ సింగ్ ఇటీవల ‘ధురంధర్’ విజయాల జోరుతో పాటు ‘ప్రళయ్’ అనే భారీ యాక్షన్ ప్రాజెక్టును లైన్లో పెట్టారు. అటు పర్సనల్ లైఫ్, ఇటు సినీ కెరీర్ రెండింటిలోనూ ఈ జోడీ విజయవంతమైన ప్రయాణాన్ని కొనసాగిస్తూ సంతోష క్షణాలను ఆస్వాదిస్తోంది.






