తెలంగాణ రాజకీయాల్లో గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం మధ్య పాలనా విధానాలపై విమర్శలు, ప్రతివిమర్శలు కొనసాగుతున్నాయి. గత పదేళ్లలో జరిగిన అభివృద్ధి, అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలను ఒకవైపు ప్రస్తావిస్తుండగా.. ప్రస్తుత ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను మరోవైపు అధికార పక్షం వివరిస్తోంది. ప్రజలు రెండు పాలనలను బేరీజు వేసుకుని తమ అభిప్రాయాన్ని ఏర్పరచుకోవాలని రాజకీయ నేతలు పేర్కొంటున్నారు.