తెలంగాణను పెట్టుబడులకు అనుకూల రాష్ట్రంగా ప్రపంచానికి పరిచయం చేయడంతో పాటు విద్య, పర్యాటకం తదితర రంగాల్లో అవకాశాలను వివరించేందుకు ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్’ నిర్వహించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది.
ఈ కార్యక్రమానికి వివిధ దేశాలు, సంస్థలకు చెందిన ప్రతినిధులను ఆహ్వానించనున్నట్లు తెలిపింది. హైదరాబాద్‌ను అంతర్జాతీయ పెట్టుబడుల కేంద్రంగా మరింత అభివృద్ధి చేయడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతున్నట్లు కథనం పేర్కొంది.