చేనేత కార్మికుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.

జాతీయ చేనేత దినోత్సవ వేదికలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. పీపుల్స్ ప్లాజాలో 100కు పైగా చేనేత స్టాళ్లతో ప్రదర్శన ప్రారంభించినట్టు తెలిపారు.

ఆగస్టు 7 నుంచి 16 వరకు చేనేత వస్త్ర ప్రదర్శన కొనసాగుతుందని చెప్పారు. చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేసి చేనేతలను ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు.