హరీశ్‌రావు అరెస్టు నేపథ్యంలో హన్మకొండలో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. అరెస్టును నిరసిస్తూ బీఆర్‌ఎస్ నాయకులు, కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నాకు దిగారు.
పార్టీ నాయకులు ప్రభుత్వ చర్యలను ప్రశ్నిస్తూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పెద్ద సంఖ్యలో కార్యకర్తలు తరలిరావడంతో పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. ఆందోళన నేపథ్యంలో కొంతసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.