భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం నిలకడగా ఉంది. శనివారం ఉదయం 11 గంటల నుంచి 56 అడుగుల వద్ద నిలకడగా ప్రవహిస్తోంది.

నీటిమట్టం పెరగడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాలను జిల్లా కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు.