అమెరికాలో స్థానిక ఉద్యోగాలు, వేతన భద్రతను కాపాడే లక్ష్యంతో యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ లేబర్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని టాస్క్ఫోర్స్ పర్యవేక్షణలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, ఇన్ఫోసిస్, విప్రో, కాగ్నిజెంట్, మైక్రోసాఫ్ట్ వంటి దిగ్గజ సంస్థల పెర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ (PERM) ప్రక్రియను సస్పెండ్ చేశారు. దీంతో కొత్తగా ఐ-140 పిటిషన్లు దాఖలు చేసే అర్హతను కంపెనీలు తాత్కాలికంగా కోల్పోయాయి.
భారత టెక్కీలకు అమెరికా భారీ షాక్: 'పెర్మ్' గ్రీన్ కార్డ్ ప్రాసెసింగ్ తాత్కాలిక నిలిపివేత!
అమెరికాలో గ్రీన్ కార్డ్ ఆశిస్తున్న వేలాది మంది భారతీయ ఐటీ నిపుణులకు అమెరికా కార్మిక శాఖ తీరని షాక్ ఇచ్చింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, మైక్రోసాఫ్ట్ సహా ప్రధాన టెక్ సంస్థలపై పెర్మనెంట్ లేబర్ సర్టిఫికేషన్ (PERM) సస్పెన్షన్ వేటు వేసింది.
అక్షర పరిమాణం
- ఈబీ-2, ఈబీ-3 కేటగిరీల కింద కొత్త పెర్మ్ దరఖాస్తుల స్వీకరణతో పాటు ప్రాసెసింగ్లో ఉన్న ఫైళ్లను కూడా నిలిపివేశారు. స్థానిక అమెరికన్ల ఉద్యోగ హక్కుల పరిరక్షణ, వీసా నిబంధనల దుర్వినియోగం ఆరోపణల నేపథ్యంలో లేబర్ డిపార్ట్మెంట్ ఈ నిర్ణయం తీసుకుంది.






