హెచ్-1బీ వీసా విధానంలో భాగంగా అభ్యర్థుల సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ను తప్పనిసరిగా తనిఖీ చేయాలంటూ అమెరికా నిబంధనలను కఠినతరం చేయడంతో వీసా రెన్యూవల్ అపాయింట్‌మెంట్లు వచ్చే ఏడాది జూన్ వరకూ వాయిదా పడ్డాయి. దీంతో సొంత దేశానికి వచ్చి వీసా స్టాంపింగ్ కోసం వేచి చూస్తున్న భారతీయులు తీవ్ర అనిశ్చితిని ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలో తమ ఉద్యోగులకు ఉపశమనం కలిగిస్తూ అమెజాన్ మార్చి 2 వరకు ఇంటి వద్ద నుంచే పనిచేసే అవకాశాన్ని ఇచ్చింది.
అయితే, భారత్ నుంచి పనిచేసే సమయంలో ఉద్యోగులపై అమెజాన్ కొన్ని కఠిన నిబంధనలను విధించింది. ముఖ్యంగా క్లయింట్లతో చర్చలు జరపడం, కొత్త కోడింగ్ చేయడం, కీలక వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడం, కోడ్ టెస్టింగ్ వంటి కీలక కార్యకలాపాలు చేపట్టడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అంతేకాకుండా వారు భారత్‌లో ఉన్న సమయంలో ఇక్కడి అమెజాన్ లోకల్ కార్యాలయాలకు సైతం హాజరుకాకూడదని స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేసింది.
For more information on this article, read page number 7 of అభ్యుదయం (Abhyudayam) e-paper dated 26-09-2026.






