ప్రజా భవన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ తెలంగాణలో విద్యుత్ వినియోగం పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే గణనీయంగా పెరిగిందన్నారు. దాదాపు 20 వేల మెగావాట్లకు చేరువవుతున్న డిమాండ్‌ను సమర్థవంతంగా నిర్వహించి, ప్రజలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసిన విద్యుత్ సంస్థల అధికారులను, ఉద్యోగులను ఆయన అభినందించారు. రాష్ట్ర విద్యుత్ రంగంపై కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శిస్తూ.. జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కంలను ప్రైవేటీకరించే ఆలోచన ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పారు. విద్యుత్ సంస్థలను పబ్లిక్ లిస్టింగ్ చేయడం గానీ, ప్రభుత్వ రంగం నుంచి తప్పించడం గానీ జరగదని, నెహ్రూ చూపిన మిశ్రమ ఆర్థిక వ్యవస్థ స్ఫూర్తితో కాంగ్రెస్ ప్రభుత్వం పీఎస్‌యూలను మరింత పటిష్టం చేస్తుందని తెలిపారు.
For more information on this article, please refer to Page Number 1 & 2, అభ్యుదయం (Abhyudayam) E-paper dated 08-10-2026






