దిగువ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఒక డెలివరీ బాయ్ అనారోగ్యంతో ఉన్న తన తల్లిని రక్షించుకోవడం కోసం సమాజంలో ఎలాంటి సవాళ్లను ఎదుర్కొన్నాడనే ఆసక్తికర కథాంశంతో 'డెలివరీ బాయ్' చిత్రం రూపొందింది. నాని దర్శకత్వం వహించిన ఈ చిత్రం కుటుంబ భావోద్వేగాలతో పాటు యాక్షన్ అంశాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తుందని చిత్ర యూనిట్ తెలిపింది. ప్రముఖ నటి రాధిక శరత్‌కుమార్ కీలక పాత్రలో నటించగా, దుష్యంత్, కాళీ వెంకట్, బోస్ వెంకట్ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు. గతేడాది డిసెంబర్‌లోనే కేవలం 42 రోజుల స్వల్ప వ్యవధిలో చిత్ర షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. అనంతరం డబ్బింగ్, ఎడిటింగ్ సహా పోస్ట్-ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి అక్టోబర్ 23న థియేట్రికల్ విడుదలకు ముహూర్తం ఖరారు చేశారు. సుందరమూర్తి సంగీతం అందించిన ఈ సినిమా పోస్టర్లను సరిగమ తమిళ్ సోషల్ మీడియా వేదికగా విడుదల చేసింది.

For more information on this article, please refer to Page Number 8, అభ్యుదయం (Abhyudayam) E-paper dated 08-10-2026.