తెలుగు చిత్రసీమలో అక్కినేని కుటుంబం ప్రస్థానం అజరామరమని కింగ్ నాగార్జున తెలిపారు. లెజెండరీ నటుడు అక్కినేని నాగేశ్వరరావు వేసిన బలమైన పునాదులపై తాము ముందుకు సాగుతున్నామని, మూడు తరాలుగా తెలుగు ప్రేక్షకుల ఆదరాభిమానాలు పొందడం తమ అదృష్టమని పేర్కొన్నారు.
​అంతర్జాతీయ ప్రఖ్యాత సినీ మ్యాగజైన్ 'వెరైటీ ఇండియా' ప్రత్యేక ముఖచిత్రంపై నాగార్జున, నాగచైతన్య, అఖిల్ కలిసి కనిపించడం సినీ వర్గాల్లో విశేష ఆకర్షణగా నిలిచింది. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచ వ్యాప్తం చేయడమే తమ ధ్యేయమని ఈ సందర్భంగా నాగార్జున స్పష్టం చేశారు.