ఊరికి దూరంగా ఉన్న హాస్టల్‌లోని 417వ గదిలో దిగిన వివేక్ (సూర్య రాజ్)కు 418వ గది నుంచి భయంకర అనుభవాలు ఎదురవుతాయి. ఆ గది వెనక ఉన్న దేవిక మిస్టరీ ఏమిటి? లండన్ నుంచి వచ్చిన సాయేషా (ప్రీతి పగడాల) ఆ రహస్యాన్ని ఎలా ఛేదించిందనేది కథాంశం. యక్షగాన కళారూపాన్ని సైకలాజికల్ హారర్‌కు ముడిపెట్టిన విధానం కొత్తగా అనిపిస్తుంది. థియేటర్లలో దయ్యాల సినిమాలను ఆస్వాదించే వారికి ఇది మంచి అనుభూతినిస్తుంది.

అభ్యుదయం దినపత్రిక (పేజీ 8)