తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా టెలికాం పెన్షనర్లకు డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికెట్లు సమర్పించేందుకు వీలుగా జీవన్‌ ప్రమాణ్‌ శిబిరాలను నిర్వహించనున్నట్లు టెలికమ్యూనికేషన్స్‌ విభాగం వెల్లడించింది. పెన్షన్‌, పెన్షనర్ల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన డిజిటల్‌ లైఫ్‌ సర్టిఫికెట్‌ ప్రచారం–5.0లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. పెన్షనర్లు తమ జీవిత ధ్రువీకరణ పత్రాలను సులభంగా సమర్పించడంతో పాటు, అక్కడికక్కడే ధ్రువీకరణ సేవలు పొందేలా ఈ శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు.

శిబిరాల తేదీలు, కేంద్రాల వివరాలు

కరీంనగర్‌ – నవంబర్‌ 6: జీఎంటీడీ కార్యాలయం, బీఎస్‌ఎన్‌ఎల్‌, టెలిఫోన్‌ భవన్‌, టవర్‌ సర్కిల్‌ రోడ్‌, సాఫ్టీ పాయింట్‌ ఎదురుగా, కరీంనగర్‌–505001.

వరంగల్‌ – నవంబర్‌ 13: పీజీఎం కార్యాలయం, బీఎస్‌ఎన్‌ఎల్‌, వరంగల్‌–506002. సంప్రదించాల్సిన అధికారి: జనరల్‌ మేనేజర్‌.

నిజామాబాద్‌ – నవంబర్‌ 13: పీజీఎంబీఏ కార్యాలయం, బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచార్‌ భవన్‌, గాంధీ చౌక్‌, నిజామాబాద్‌–503001. సంప్రదించాల్సిన అధికారి: ప్రిన్సిపల్‌ జనరల్‌ మేనేజర్‌.

చిక్కడపల్లి, హైదరాబాద్‌ – నవంబర్‌ 17: ప్రిన్సిపల్‌ సీసీఏ, తెలంగాణ సర్కిల్‌ కార్యాలయం, చిక్కడపల్లి, హైదరాబాద్‌–500020.

కేపీహెచ్‌బీ, హైదరాబాద్‌ – నవంబర్‌ 17: ప్రిన్సిపల్‌ సీసీఏ, తెలంగాణ సర్కిల్‌ కార్యాలయం, కేపీహెచ్‌బీ, హైదరాబాద్‌–500072.

మహబూబ్‌నగర్‌ – నవంబర్‌ 20: డీజీఎం కార్యాలయం, బీఎస్‌ఎన్‌ఎల్‌ టెలిఫోన్‌ ఎక్స్ఛేంజ్‌, బస్టాండ్‌ సమీపంలో, మహబూబ్‌నగర్‌–509001.

ఈ కేంద్రాల్లో శిబిరాలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నారు.

చిక్కడపల్లిలో నెల రోజుల పాటు ప్రత్యేక శిబిరం

హైదరాబాద్‌లోని చిక్కడపల్లిలో నవంబర్‌ 1 నుంచి 30వ తేదీ వరకు ప్రత్యేక శిబిరం ఏర్పాటు చేశారు. శనివారాలు, ఆదివారాలు, ప్రభుత్వ సెలవు దినాలు మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సేవలు అందుబాటులో ఉంటాయి. ఈ శిబిరం ప్రిన్సిపల్‌ సీసీఏ, తెలంగాణ సర్కిల్‌ కార్యాలయం, చిక్కడపల్లి, హైదరాబాద్‌–500020లో కొనసాగుతుంది.

టెలికాం పెన్షనర్లు తమకు అనుకూలమైన కేంద్రాన్ని, తేదీని ఎంచుకుని ఈ సేవలను వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.

మూలం: ప్రెస్‌ ఇన్ఫర్మేషన్‌ బ్యూరో (పీఐబీ), హైదరాబాద్‌ | 2 నవంబర్‌ 2026