ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులను డిసెంబర్ గడువులోగా పూర్తి చేయాలని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. పనుల కారణంగా ప్రజలకు, వాహనదారులకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు.
నిర్మాణ పనుల్లో వేగం పెంచడంతో పాటు అవసరమైన చోట్ల రాత్రి వేళల్లోనూ పనులు కొనసాగించాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ మళ్లింపులు, ఇతర ప్రత్యామ్నాయ ఏర్పాట్లను ముందుగానే సిద్ధం చేయాలని చెప్పారు.
ఎలివేటెడ్ కారిడార్ పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ నిర్ణీత సమయంలో ప్రాజెక్టును పూర్తి చేయాలని మంత్రి స్పష్టం చేశారు.