ఉక్రెయిన్ యుద్ధంలో మృతిచెందిన సుదర్శన్ భౌతికకాయం తరలింపునకు రూ.6 లక్షలు మంజూరు
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన తెలంగాణ వాసి అవిలాల సుదర్శన్ పార్థివదేహాన్ని స్వదేశానికి రప్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఆయన భౌతికకాయాన్ని తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) నుంచి రూ. 6 లక్షల ఆర్థిక సాయాన్ని మంజూరు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు
అక్షర పరిమాణం
🕒 1 గంటల క్రితం👁 0 వీక్షణలు
ప్రజావాణిలో మృతుడి భార్య భార్గవి చేసిన విజ్ఞప్తికి రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది.
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ చేసిన లేఖ ద్వారా సిఫారసుతో ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి తక్షణ నిధులు విడుదలయ్యాయి.
ఉక్రెయిన్ యుద్ధంలో మరణించిన సుదర్శన్ పార్థివదేహానికి సీఎంఆర్ఎఫ్ సాయం ప్రకటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
ఈ ఏడాది సెప్టెంబర్ 1వ తేదీన రష్యా-ఉక్రెయిన్ సరిహద్దు యుద్ధంలో అవిలాల సుదర్శన్ దురదృష్టవశాత్తూ మరణించారు. స్వగ్రామంలో ఆయన అంత్యక్రియలు నిర్వహించేందుకు పార్థివదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి ఆర్థిక స్తోమత లేకపోవడంతో, ఆయన భార్య భార్గవి అక్టోబర్ 9న ప్రజావాణి కార్యక్రమంలో ప్రభుత్వాన్ని ఆశ్రయించారు. ఆ కుటుంబ పరిస్థితిని, ఆర్ధిక ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. మానవతా దృక్పథంతో స్పందించిన ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి, సుదర్శన్ పార్థివదేహాన్ని భారత్‌కు తరలించేందుకు అయ్యే ఖర్చుల నిమిత్తం సీఎం సహాయనిధి నుంచి రూ.6.00 లక్షలు కేటాయించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
For more information on this article please read page number 1 dated on 13-10-2026 in Abhyudayam E-paper.