కొలంబో, అభ్యుదయం శ్రీలంకతో రెండు టెస్టుల సిరీస్‌కు సన్నాహకంగా సాగుతున్న వార్మప్ మ్యాచ్‌లో భారత బౌలర్లు తేలిపోయారు.
బ్యాటింగ్‌కు అనుకూలమైన వికెట్‌పై శ్రీలంక ఎలెవన్ బ్యాటర్లు భారీ స్కోరు నమోదు చేశారు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 8 వికెట్లకు 363 పరుగులు చేశారు.
నిషాన్ ఫెర్నాండో 66, రాహుల్ రసంతా 71 పరుగులతో రాణించారు. భారత బౌలర్లలో కుల్‌దీప్ యాదవ్ 2/76, మానవ్ సుతార్ 2/33 తీసుకున్నారు.






