భారతీయ చలనచిత్ర పరిశ్రమలోనే అత్యంత భారీ బడ్జెట్‌తో అంతర్జాతీయ సాంకేతిక విలువలతో రూపొందుతున్న ‘రామాయణ’ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. దసరా పండుగ సందర్భంగా చిత్ర యూనిట్ రెండో ట్రైలర్‌ను అక్టోబర్ 20, 2026న విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రధాన పాత్రలను హైలైట్ చేస్తూ రూపొందించిన ఈ విజువల్ వండర్ కొత్త ట్రైలర్‌పై అభిమానుల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. అయితే దీనిపై నిర్మాణ సంస్థ అధికారిక ప్రకటన వెల్లడించాల్సి ఉంది.

For more information on this article please read page number 8 dated on 13-10-2026 in Abhyudayam E-paper.