భారత క్రికెట్ జట్టుతో చారిత్రాత్మక టీ20 సమరానికి జపాన్ సిద్ధమైంది. భారత్‌తో జరగనున్న ప్రత్యేక పోరుకు జపాన్ తన జట్టును అధికారికంగా ప్రకటించింది.
జపాన్ క్రికెట్‌లో ప్రతిభావంతులైన యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించడంతో పాటు, దేశంలో క్రికెట్‌ను మరింత విస్తరించాలన్న లక్ష్యంతో ఈ జట్టును ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. కెండల్ కడోవాకి-ఫ్లెమింగ్, డెక్లాన్ సుజుకి-మెక్‌కాంబ్ వంటి ఆటగాళ్లతో పాటు అనుభవజ్ఞులు కూడా జట్టులో చోటు దక్కించుకున్నారు.
మియాచి, మకోటో తానియామా వంటి ఆటగాళ్లు కూడా జపాన్ లైనప్‌లో ఉన్నారు. ముఖ్యంగా షేన్ వార్న్ బౌలింగ్ వీడియోలు చూస్తూ స్పిన్ నేర్చుకున్న తానియామా.. తన ఆరాధ్య క్రికెటర్ జెర్సీ నంబర్ 23తో ఆడనుండటం ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తోంది.
ఈ మ్యాచ్‌ను ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాల 75వ వార్షికోత్సవాల సందర్భంగా ‘స్పోర్ట్ 75’ పేరుతో నిర్వహిస్తున్నట్లు కథనం పేర్కొంది.
భారత్‌తో మ్యాచ్ అనంతరం జపాన్ జట్టు సెప్టెంబర్ 19, 20 తేదీల్లో మరో రెండు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. అనంతరం ఆసియా క్రీడల్లో భాగంగా సెప్టెంబర్ 24న అఫ్గానిస్థాన్, సెప్టెంబర్ 26న నేపాల్‌తో తలపడనుంది.
భారత్‌తో జరిగే చారిత్రాత్మక పోరు జపాన్ క్రికెట్‌కు అంతర్జాతీయ స్థాయిలో మరింత గుర్తింపు తీసుకురావడానికి ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.
ఇండియాతో చారిత్రాత్మక పోరుకు జపాన్ జట్టు ప్రకటన
భారత్‌తో జరగనున్న చారిత్రాత్మక టీ20 పోరుకు జపాన్ క్రికెట్ జట్టు సిద్ధమైంది. ఈ మ్యాచ్ కోసం జపాన్ తన జట్టును అధికారికంగా ప్రకటించింది. సెప్టెంబర్‌లో జరిగే ఈ పోరుతో ఇ
అక్షర పరిమాణం
- భారత్‌తో చారిత్రాత్మక టీ20 మ్యాచ్‌కు జపాన్ జట్టు ఎంపిక.
- ఆసియా క్రీడల నేపథ్యంలో జపాన్ క్రికెట్‌కు ఈ మ్యాచ్ కీలకంగా మారనుంది.






