గత కొద్ది రోజులుగా హెచ్చుతగ్గులకు లోనవుతున్న బంగారం ధరలు మరోసారి పుంజుకున్నాయి. గుడ్ రిటర్న్స్ నివేదిక ప్రకారం.. అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పవనాలు, కొనుగోళ్ల జోరుతో ధరలు పెరిగాయి. ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,150 పెరిగి రూ. 1,44,750 వద్దకు చేరుకోగా, 22 క్యారెట్ల రేటు రూ. 1,32,700 గా నమోదైంది. తెలుగు రాష్ట్రాలైన హైదరాబాద్, విజయవాడ, విశాఖలలో 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం ధర రూ. 950 ఎగబాకి రూ. 1,32,550కి చేరింది. మరోవైపు పారిశ్రామిక డిమాండ్ పెరగడంతో ఢిల్లీ, ముంబైలలో కిలో వెండి ధర రూ. 2,05,000 మార్కును తాకింది.

మూలం & తేదీ: అభ్యుదయం దినపత్రిక, పేజీ సంఖ్య: 7 | తేదీ: 10-11-2026.