గాలే:
వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC 2027) ఫైనల్ రేసులో నిలవడమే లక్ష్యంగా శ్రీలంక పర్యటనకు వచ్చిన భారత జట్టుకు తుది జట్టు ఎంపిక పెద్ద తలనొప్పిగా మారిందని కెప్టెన్ శుభ్‌మన్ గిల్ అన్నారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా టీమిండియా తమ కెరీర్‌లో 600వ టెస్ట్ మ్యాచ్ ఆడుతుండటం గర్వకారణమని ఆయన తెలిపారు.
​మిడిలార్డర్‌లో ఎవరిని ఎంపిక చేయాలనే దానిపై స్పందిస్తూ.. సీనియర్లు అందుబాటులో లేని వేళ జట్టులోకి వచ్చిన సాయి సుదర్శన్, సర్ఫరాజ్ ఖాన్ వంటి యువ ఆటగాళ్లు తమ ప్రతిభతో ఆకట్టుకుంటున్నారని గిల్ ప్రశంసించారు. అయితే వీరిలో ఎవరికి అవకాశం ఇవ్వాలనే విషయంలో తీవ్ర పోటీ నెలకొందని, పిచ్ స్వభావం, ప్రత్యర్థి బౌలింగ్ విభాగాన్ని బేరీజు వేసుకుని బౌలర్లు, బ్యాటర్లతో సమతూకం ఉండేలా తుది జట్టును ఎంపిక చేస్తామని స్పష్టం చేశారు.