హైదరాబాద్:
గతంలో ప్రధానంగా మద్యపానం చేసే వారిలోనే కనిపించే కాలేయ సమస్యలు.. ఇప్పుడు ఆహారపు అలవాట్లు, ఆధునిక జీవనశైలి లోపాల వల్ల సాధారణ ప్రజల్లోనూ విపరీతంగా పెరుగుతున్నాయి. అధిక బరువు, మధుమేహం, రక్తపోటు వంటి సమస్యలు మెటబాలిక్ డిస్‌ఫంక్షన్-అసోసియేటెడ్ స్టీటోహెపటైటిస్ (MASH/MASLD) వ్యాప్తికి దారితీస్తున్నాయని అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.
​భారతదేశ జనాభాలో సుమారు 16 నుండి 32 శాతం మంది ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతుండగా, చిన్నపిల్లల్లో కూడా ఈ ముప్పు 35 శాతానికి పైగా ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. జంక్ ఫుడ్ తగ్గించడం, తాజా కూరగాయలు, ఆకుకూరలు ఆహారంలో భాగం చేసుకోవడం, రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ద్వారా ఈ కాలేయ వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.