ప్రపంచ ఆర్థరైటిస్ దినోత్సవం సందర్భంగా కరీంనగర్ మెడికవర్ ఆసుపత్రిలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆర్థోపెడిక్ సర్జన్లు డాక్టర్ వేణుగోపాల్, డాక్టర్ రాకేష్ మాట్లాడారు. కీళ్లలో వాపు, నొప్పి, బిగుతు రావడం, నడవడం లేదా కూర్చోవడం ఇబ్బందిగా మారడం ఆర్థరైటిస్ ప్రధాన లక్షణాలని వారు తెలిపారు. చాలామంది నొప్పి తగ్గడానికి వైద్యుల సలహా లేకుండా తరచూ పెయిన్ కిల్లర్ మాత్రలను వేసుకుంటుంటారని, దీనివల్ల కడుపులో అల్సర్లు, రక్తస్రావం, కిడ్నీలు దెబ్బతినే ముప్పు అధికమవుతుందని హెచ్చరించారు. ప్రారంభంలోనే వైద్యులను సంప్రదించి వ్యాయామాలు, ఆహార నియమాలు, మందుల ద్వారా సమస్యను అదుపులో ఉంచుకోవచ్చని పేర్కొన్నారు.
For more information on this article please read page number 5 dated on 13-10-2026 in Abhyudayam E-paper.






