భారత క్రికెట్ చరిత్రలో ఎంఎస్ ధోనీ సృష్టించిన ముద్ర మరువలేనిది. మైదానంలో ఎంత ప్రశాంతంగా ఉండే ధోనీ, మైదానం వెలుపల కూడా యువ ఆటగాళ్లకు సలహాలు సూచనలు ఇస్తుండేవారు.

ఇటీవల సూపర్ కింగ్స్ తరఫున ఆడిన అజింక్య రహానే ఆయన రూమ్ కల్చర్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

"హోటల్‌లో ఆయన గది తలుపులు రోజుకు 24 గంటలు తెరిచే ఉండేవి. జట్టులోని ఆటగాళ్లు ఎప్పుడైనా వెళ్లొచ్చు. అయితే తలుపు మూసి ఉంటే మాత్రం ఎవరూ లోపలికి వెళ్లేవారు కాదు" అని రహానే చెప్పారు.