కార్పొరేట్‌ ఉద్యోగంలో పనిచేస్తూనే స్వతంత్రంగా ఎదగాలనే ఆశయంతో శ్రుతి కుందన్‌ తన వ్యాపార ప్రయాణాన్ని ప్రారంభించారు. ఉద్యోగాన్ని వదిలి కేవలం రూ.11 వేల పెట్టుబడితో ‘బోహోలెట్‌’ పేరుతో చేతితో తయారు చేసే కొవ్వొత్తుల వ్యాపారాన్ని మొదలుపెట్టారు.

మొదట ఇంటి వంటగదిలోనే కొవ్వొత్తులను తయారు చేసి విక్రయించడం ప్రారంభించారు. క్రమంగా వినియోగదారుల ఆదరణ పెరగడంతో వ్యాపారాన్ని విస్తరించారు. ప్రస్తుతం కొవ్వొత్తుల తయారీతో పాటు ప్యాకేజింగ్‌, చిన్న వ్యాపారాలకు సేవలందించే సంస్థగా అభివృద్ధి చేసినట్లు కథనం పేర్కొంది.